CM-Reventh Reddy | రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై అవసరమైతే ఎస్మా
CM-Reventh Reddy | రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై అవసరమైతే ఎస్మా
ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు
Hyderabad : రాష్ట్రంలో రైతులను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్ధని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఒక వేళ రైతులను ఇబ్బంది పెట్టాలని చూసిన వ్యాపారులపై అవసరమైతే (Essential Services Maintinence Act - ESMA ) కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కొందరు వ్యాపారులు అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు తన దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సీఎం సూచించారు.
* * *
Leave A Comment